- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bhadradri : భద్రాద్రి వద్ద ప్రమాద హెచ్చరికలు ఉపసంహరణ..
by Batti.Sumithra |
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు తగ్గి, గోదావరికి వరద ఉధృతి తగ్గడంతో భద్రాద్రి వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. దీంతో 1,2,3 ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించారు.

X
దిశ, భద్రాచలం : రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు తగ్గి, గోదావరికి వరద ఉధృతి తగ్గడంతో భద్రాద్రి వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. దీంతో 1,2,3 ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించారు. శనివారం సాయంత్రం 4 గంటలకు గోదావరి 3 వ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకొని 53.9 అడుగులు వరకూ పెరిగి అనంతరం తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం 4 గంటలకు మూడో ప్రమాద హెచ్చరిక, రాత్రి రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించిన అధికారులు, సోమవారం రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులకు తగ్గి గోదావరి ప్రవహిస్తుండటంతో ఫస్ట్ వార్నింగ్ కూడా ఉపసంహరించారు.
Next Story






