rain damage : నీట మునిగిన పంట పొలాలు

by Sridhar Babu |

మండల వ్యాప్తంగా రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగిపోయాయి.

rain damage : నీట మునిగిన పంట పొలాలు
X

దిశ, ఏన్కూర్ : మండల వ్యాప్తంగా రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలకు పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జన్నారం అంజనా పురం మధ్య వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిపివేశారు. రేపల్లెవాడ, నాచారం, మేడేపల్లి, మూలపోచారం,రంగాపురం, జన్నారం,అంజనా పురం మధ్య వాగును తహసీల్దార్ సీహెచ్. శేషగిరిరావు, ఎస్ఐ బాదావత్ రవి పరిశీలించారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఆనందరావు, గూగుల్ శ్రీను, నరేష్ మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story