సమస్యల పరిస్కారమే సీపీఐ ప్రధాన ఎజెండా

by Nallavelli.Anjaneyulu |

చుంచుపల్లి/ లక్ష్మీదేవిపల్లి : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిస్కారంకోసం కృషిచేయడమే సీపీఐ

సమస్యల పరిస్కారమే సీపీఐ ప్రధాన ఎజెండా
X

చుంచుపల్లి/ లక్ష్మీదేవిపల్లి : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిస్కారంకోసం కృషిచేయడమే సీపీఐ ప్రధాన ఎజెండా అని, సీపీఐ ప్రజాప్రతినిధుల లక్ష్యమని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గ్రామపంచాయతి ఎన్నికలను పురస్కరించుకొని బుధవారం చుంచుపల్లి మండల పరిధిలోని పెనుబల్లి, పెనగడప, అంబేద్క‌ర్ నగర్ గ్రామపంచాయతీల్లో, లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని శేషగిరినగర్, తెలగారమవరం, హేమచంద్రాపురం, గడ్డిగుట్ట గ్రామపంచాయతీల్లో విస్తృతంగా పర్యటించి అభ్యర్థులకు, పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశాల్లో కూనంనేని మాట్లాడుతూ గ్రామాల్లో పారదర్శక పాలనా సీపీఐ ప్రజా ప్రతినిధులతోనే సాధ్యమని, ప్రజలకు వెన్నంటి ఉండేది సీపీఐ ప్రజా ప్రతినిధులేనన్నారు. ప్రజల్లో మమేకమై గ్రామస్వపరిపాలన కోసం సీపీఐ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వంతో కొట్లాడి వివిధ పథకాల్లో నిధులు రాబట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని, ప్రజాసమస్యలు పరిష్కరించగలిగామన్నారు. ప్రతి పథకాన్ని గ్రామీణ పేదలగడప చేర్చే బాధ్యతాయుత పాలనకు కమ్యూనిస్టు పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Next Story