కౌన్సిల్ సమావేశాలు.. ఎప్పుడో..?

by Thanuru Gopichand |

కార్పొరేషన్‌లో కౌన్సిల్ సమావేశాల ఊసెత్తడం లేదు. నగర అభివృద్ధికి ఎంతో కీలకమైన సమావేశాలు నిర్లక్ష్యం చూపడంతో అభివృద్ధి పనులు, ఇతర సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి.

కౌన్సిల్ సమావేశాలు.. ఎప్పుడో..?
X

దిశ, ఖమ్మం కార్పొరేషన్ : కార్పొరేషన్‌లో కౌన్సిల్ సమావేశాల ఊసెత్తడం లేదు. నగర అభివృద్ధికి ఎంతో కీలకమైన సమావేశాలు నిర్లక్ష్యం చూపడంతో అభివృద్ధి పనులు, ఇతర సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. వాస్తవంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి కార్పొరేషన్‌లో కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి. సమస్యలను మినిట్స్ రూపంలో నమోదు చేయాలి. గత సమావేశంలో ప్రస్తావించిన సమస్యలు ఎన్ని పరిష్కారమయ్యాయో తదుపరి సమావేశంలో చర్చించుకోవాలి. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితులు కానరావడం లేదు.

డివిజన్లలో ముఖ్య సమస్యలు నెలకొన్నా కార్పొరేటర్లు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఇటీవల ఓ అధికార పార్టీ కార్పొరేటర్ తన డివిజన్లో నెలకొన్న సమస్యలను కమిషనర్ వద్ద వెళ్లబోసుకున్నారు. డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించినా బిల్లులు రావని కాంట్రాక్టర్లు పనిచేసేందుకు ముందుకు రావడం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ 30న కార్పొరేషన్ పాలకవర్గ పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో సమస్యలు అపరిష్కృతంగా ఉండాల్సిందేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఖమ్మం కార్పొరేషన్‌లో కౌన్సిల్ సమావేశాలు ఎంతో ముఖ్యమైనవి. సదరు సమావేశాలు నిర్వహించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. వివిధ సమస్యలపై చర్చించడం, నిధులు కేటాయింపుపై తీర్మానాలు చేయడం తదితర అంశాలు కౌన్సిల్ సమావేశంలో ఎజెండా రూపంలో చేపడతారు. అయితే ఖమ్మం కార్పొరేషన్‌లో కౌన్సిల్ సమావేశాలు సకాలంలో నిర్వహించకపోవడంతో సమస్యలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలువక ప్రజల సతమతమవుతున్నారు. అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇక తమ డివిజన్లలో నెలకొన్న సమస్యలు కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశాల్లో ప్రస్తావించి కమిషనర్, మేయర్ దృష్టికి తీసుకువెళ్తారు. వారు సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారానికి ఆదేశాలిస్తుంటారు. అయితే సమావేశాలు లేకపోవడంతో కార్పొరేటర్లు గళం ఎత్తలేకపోతున్నారు.

ప్రతి ఆరు నెలలకు ఒకసారి...

వాస్తవంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి కార్పొరేషన్‌లో కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి. సమస్యలను మినిట్స్ రూపంలో నమోదు చేయాలి. గత సమావేశంలో ప్రస్తావించిన సమస్యలు ఎన్ని పరిష్కరించబడ్డాయో తదుపరి సమావేశంలో చర్చించుకోవాలి. అలాగే కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో సభ్యులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ తదితరులు ఈ సమావేశానికి సమావేశాలకు హాజరు కావలసి ఉంటుంది. వారు తమ పరిధిలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న కౌన్సిల్ సమావేశాలను నిర్వహించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.

ముఖ్య సమస్యలు నెలకొన్నా..

డివిజన్లలో ముఖ్య సమస్యలు నెలకొన్నా కార్పొరేటర్లు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. చివరకు కుక్కల కోతుల బెడద కూడా నివారించలేని పరిస్థితుల్లో కార్పొరేటర్లు ఉన్నారు. ఇటీవల ఒక అధికార పార్టీ కార్పొరేటర్ తన డివిజన్లో నెలకొన్న సమస్యలను కమిషనర్ వద్ద వెళ్లబోసుకున్నారు. ఇక డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించినా బిల్లులు రావని కాంట్రాక్టర్లు పనిచేసేందుకు ముందుకు రావటం లేదు. కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా ఎవరు స్పందించడం లేదు. అదే కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరికేది నిధులు కేటాయించినా ఫలితం మాత్రం శూన్యమైంది. ఇలా పలు సమస్యలు అపరిస్కృతంగా ఉండిపోయాయి వచ్చే ఏడాది ఏప్రిల్ 30న కార్పొరేషన్ పాలకవర్గ పదవీకాలం పూర్తవుతుంది. కొత్త ఏ డాదిలోనైనా కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తే కొన్ని సమస్యలైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.

Next Story