- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పురుగుల మందు తాగి కాంట్రాక్టర్ ఆత్మహత్య
మండల పరిధిలోని మొట్లగూడెం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ గడిపర్తి శ్రీను(50) శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి

దిశ, కారేపల్లి: మండల పరిధిలోని మొట్లగూడెం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ గడిపర్తి శ్రీను(50) శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... మృతుడు గడిపర్తి శ్రీను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మాజీ మున్సిపల్ చైర్మన్ (ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు) దమ్మాలపాటి వెంకటేశ్వరరావు(డివి)లు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. అలాగే...వరుసకు బావబామ్మర్దులు. గత రెండు దశాబ్దాలుగా వీరిద్దరితో పాటు ఇంకొంతమందితో కలిసి ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఇల్లందు నియోజకవర్గంతో పాటు మున్సిపాలిటీలో జరిగిన పలు అభివృద్ధి కాంట్రాక్టు పనులకు గడిపర్తి శీను పెట్టుబడి పెట్టాడు. గత కొంతకాలంగా ఆర్థిక లావాదేవీలపై బావబామ్మర్దులకు విభేదాలు తలెత్తాయి.
దీంతో పలుసార్లు పెద్దలతో కలిసి చర్చలు కూడా జరిపారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రి ఖమ్మం పట్టణంలో కొందరి సమక్షంలో వారి ఇరువురి ఆర్థిక లావాదేవీలపై చర్చించారు. ఈ చర్చల్లో తనకు న్యాయం జరగలేదని మనస్థాపానికి గురైన గడిపర్తి శ్రీను...కారులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో ఆగ్రహించిన మృతుడు శ్రీను కుటుంబ సభ్యులు, బంధువులు శవాన్ని... దమ్మాలపాటి వెంకటేశ్వరరావు(డివి) ఇంటికి తీసుకువెళ్లి ఆవరణలో ఉంచి ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు డివి ఇంటి అద్దాలతో పాటు కారు అద్దాలు ధ్వంసం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులతో చర్చించి మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన గడిపర్తి శ్రీను భార్య గడిపర్తి రమ శనివారం కారేపల్లి పోలీస్ స్టేషన్లో తన భర్త ఆత్మహత్యకు గల కారకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






