- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్తి పన్నుల వసూళ్లలో గందరగోళం
ఖమ్మం కార్పొరేషన్‌లో ఆస్తి పన్నుల వసూలు విషయంలో గందరగోళం నెలకొంది. ఆస్తి పన్నులు చెల్లించేందుకు ఇచ్చే డిమాండ్ నోటీసుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది.

ఖమ్మం కార్పొరేషన్‌లో ఆస్తి పన్నుల వసూలు విషయంలో గందరగోళం నెలకొంది. ఆస్తి పన్నులు చెల్లించేందుకు ఇచ్చే డిమాండ్ నోటీసుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఒకే ఇంటి నెంబర్‌పై రెండు డిమాండ్ నోటీసులు ఇవ్వడంతో ఇంటి యజమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇచ్చిన డిమాండ్ నోటీసుల్లో ఏది పన్ను తక్కువగా ఉంటే అదే సొమ్మును చెల్లిస్తున్నారు. దీంతో ఖమ్మం కార్పొరేషన్ కు వచ్చే ఆదాయంలో గండిపడటమే కాకుండా ఆస్తి పనుల విషయంలో భారీ బకాయిలు ఆన్‌లైన్‌లో రూ. 5కోట్లు కనబడుతున్నాయి. బకాయి పడ్డ పన్నుల వసూలుకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తుండటంతో అయితే లేని పన్నులు ఎలా వసూలు చేయాలో అర్థం కాక ఖమ్మం కార్పొరేషన్ రెవెన్యూ విభాగం అధికారులు తలలు పట్టుకుంటారు. ఆస్తి పన్నులు డిమాండ్ నోటీసులు ఇవ్వడం, పన్ను వసూలు విషయంలో రెవెన్యూ సిబ్బంది చూపిన నిర్లక్ష్యం ఇప్పుడు కొండంతగా మారి తలకు చుట్టుకుంది. వాస్తవంగా పన్నుల వసూళ్లను ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన అధికారులు పట్టించుకోక పోవడంతో బకాయిలు భారీగా ఉన్నట్టు కనిపిస్తోంది. - దిశ, ఖమ్మం కార్పొరేషన్
దిశ, ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మం కార్పొరేషన్‌కు ముఖ్య ఆదాయ వనరు అయిన రెవెన్యూ విభాగంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతుంది. ఆస్తి పన్నుల వసూలు విషయంలో గందరగోళం నెలకొంది. ఆస్తి పన్నులు చెల్లించేందుకు ఇచ్చే డిమాండ్ నోటీసుల్లో నిర్లక్ష్యం కనబడుతుంది. ఒకే ఇంటి నెంబర్ మీద రెండు డిమాండ్ నోటీసులు ఇవ్వడంతో ఇంటి యజమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇచ్చిన డిమాండ్ నోటీసుల్లో ఏది పన్ను తక్కువగా ఉంటే సదరు సొమ్మును చెల్లిస్తున్నారు. దీంతో ఖమ్మం కార్పొరేషన్ కు వచ్చే ఆదాయంలో గండిపడటమే కాకుండా ఆస్తి పనుల విషయంలో భారీ బకాయిలు ఆన్‌లైన్‌లో కనబడుతున్నాయి. దీంతో కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అథారిటి(సీడీఎంఏ) నుంచి బకాయి పడ్డ పన్నుల వసూలుకు ఒత్తిడి వస్తున్నది. అయితే లేని పన్నులు ఎలా వసూలు చేయాలో అర్థం కాక ఖమ్మం కార్పొరేషన్ రెవెన్యూ విభాగం అధికారులు తలలు పట్టుకుంటారు. ఇప్పటికే ఐదు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్టు ఆన్‌లైన్‌లో ఉంది.
అసలేం జరిగిందంటే..
ఆస్తి పన్నులు డిమాండ్ నోటీసులు ఇవ్వడం, పన్ను వసూలు విషయంలో రెవెన్యూ సిబ్బంది చూపిన నిర్లక్ష్యం ఇప్పుడు కొండంతగా మారి తలకు చుట్టుకుంది. వాస్తవంగా పన్నుల వసూళ్లను ఎప్పటికప్పుడు సమీక్షించవల్సిన అధికారులు పట్టించుకోక పోవడంతో బకాయిలు భారీగా ఉన్నట్టు కనబడుతుంది. ఉదాహరణకు నగరం పరిధిలోని ఖానాపురంలో ఒక పబ్లిక్ స్కూల్‌ను గతంలో ఏర్పాటు చేశారు. దానికి ప్రతి ఏడాది సుమారు రూ.రెండు లక్షల వరకు ఆస్తిపన్ను విధిస్తున్నారు. ప్రస్తుతం సదరు పాఠశాల భవనాన్ని కూల్చివేసి వేరే ప్రాంతానికి వెళ్లారు. అయితే ఇప్పటికీ ఆ పాఠశాలకు ఖానాపురంలో పన్ను డిమాండ్ నోటీసులు పంపిస్తూనే ఉన్నారు. కొత్తగా వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసిన సదరు పాఠశాలకు కూడా పన్ను విధించి డిమాండ్ నోటీసు పంపిస్తున్నారు. ఇలా ఒకే దానికి రెండుసార్లు పన్ను విధించినా దాన్ని సరిచేసుకోవడం లేదు. తొలగించిన భవనాలకు, వేరే చోటికి వెళ్ళిన వారికి రెండు డిమాండ్ నోటీసు పంపించడంతో వారు తక్కువ పన్ను వచ్చిన డిమాండ్ నోటీసుని తీసుకొని పన్ను చెల్లించడంతో బకాయి చూపెడుతుంది. నగరంలోని ముస్తఫానగర్‌తో సహా పలు ప్రాంతాల్లో ఇలా రెండు డిమాండ్ నోటీసులు పంపించి అధికారులు తప్పిదాలు చేస్తున్నారు.
దీర్ఘకాలంగా ఇదే పరిస్థితి..
ఖమ్మం కార్పొరేషన్‌లో దీర్ఘకాలంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు పన్నుల బకాయిలు రూ.5కోట్లకు చేరుకున్నాయి. వీటిని ఎలా వసూలు చేసే పరిస్థితి లేదు. ఒకే ఇంటికి రెండు నోటీసులు పంపడంతో పరిస్థితి ఇలా తయారైంది. అయితే కార్పొరేషన్ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించి ఈ బకాయిలను రద్దు చేసేలా తీర్మానం చేయాలని రాష్ట్ర సీడీఎంఏ అధికారులు ఖమ్మం కార్పొరేషన్ రెవెన్యూ విభాగం అధికారులకు సూచించారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో రూ.5కోట్ల బకాయి అలాగే ఉండిపోయింది. దీన్ని సరిదిద్దలేకపోతున్నారు. ఈ విషయమై రెవెన్యూ అధికారుల వివరణ దిశ విలేకరి కోరగా రెండు డిమాండ్ నోటీసులు పంపడం లేదని తప్పుడు సమాధానాలు చెప్పారు. మరి ఆస్తి పన్ను బకాయిలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించగా పరిశీలిస్తామని వివరణ ఇచ్చారు.






