- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరుస్తాం: ఎమ్మెల్యే
కమలాపురం గ్రామంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం విస్తృతంగా పర్యటించారు.

దిశ, ములకలపల్లి: మండలంలోని కమలాపురం గ్రామంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో తొలి విడతలో నిర్మించుకున్న ఎనిమిది ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో పక్షవాతంతో బాధపడుతున్న గడ్డం రాజును, నడుము విరిగి మంచానికే పరిమితమైన మడివి రాజును పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మడివి రాజుకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లోని నీమ్స్ ఆసుపత్రికి పంపించి అవసరమైన వైద్య సహాయం అందిస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో గుడిసెలు, గడ్డి ఇళ్లలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు తొలి ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటిని అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వగ్గెల రాధ, కాంగ్రెస్ నాయకులు బత్తుల అంజి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు జహీరుద్దీన్, బాల అప్పారావు, పువ్వాల మంగపతి, పర్వతనేని అమర్నాథ్, కరుటూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






