- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: ఎన్టీఏ హెచ్చరిక
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తీవ్రంగా ఖండించింది....

దిశ, తెలంగాణ బ్యూరో: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కేవలం అవాస్తవాలని, విద్యార్థులను తప్పుదోవ పట్టించేందుకే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేసింది. ఇటీవల ముగిసిన నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు సంబంధించి క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, పోటీ తీవ్రంగా ఉండే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ వీడియోతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో ఎన్టీఏ సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. వైరల్ అవుతున్న కంటెంట్‌లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. జూన్ 21న నిర్వహించిన నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, పారదర్శకంగా, విజయవంతంగా పూర్తయిందని ఏజెన్సీ స్పష్టం చేసింది. పరీక్షల సమగ్రతను దెబ్బతీసేలా తప్పుడు సమాచారాన్ని, పుకార్లను వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ హెచ్చరించింది. విద్యార్థులు ఎవరూ ఇలాంటి పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించింది.






