- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Collector : జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తా
జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

దిశ, కొత్తగూడెం : జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భద్రాద్రి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న అండర్ 17 బాల బాలికల రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆనందఖని ఆవరణలో ప్రారంభమైన ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ.. పోటీలలో పాల్గొనే క్రీడాకారులు తాము ఏ పరిస్థితుల నుంచి, ఎక్కడి నుంచి వచ్చాము అని కాకుండా గెలవాలనే ఆకాంక్ష ఎక్కువగా ఉండాలని, అప్పుడే విజయం సాధించగలరని అన్నారు.
పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో సైతం పాల్గొనడం వల్ల జీవితంలో చక్కగా స్థిరపడవచ్చు అని పేర్కొన్నారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి తన వంతు కృషి చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. రాష్ట్రస్థాయి పోటీల ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు.
టీం ఛాంపియన్షిప్ లో కాంస్య పతకం సాధించిన ఆతిథ్య జట్టు
టీం ఛాంపియన్షిప్, వ్యక్తిగత అంశాల్లో ఈ పోటీలు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర జట్టును ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలకు పంపనున్నారు. ఈ పోటీలలో టీం ఛాంపియన్షిప్ విభాగంలో ఆతిథ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా బాలికల జట్టు తృతీయ స్థానం సాధించింది. బాలుర జట్టు సైతం అద్భుతమైన ప్రతిభ కనబరిచి క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది.
ఆదివారం సాయంత్రం నుంచి వ్యక్తిగత పోటీలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వరా చారి, ఎస్జీఎఫ్ కార్యదర్శి నరేష్ కుమార్తో పాటు ఈ పోటీల రాష్ట్ర పరిశీలకులు మామిడి సంతోష్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు బట్టు ప్రేమ్ కుమార్, యనమదల వేణుగోపాల్, లక్ష్మయ్య, శేఖర్, స్టెల్లా, రాము, కవిత, సీతాదేవి, సుజాత,నాగలక్ష్మి పాల్గొన్నారు.






