- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జవహర్ నవోదయ విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్
by velandi.Saikiran |
ఉన్నత లక్ష్యాలు సాధించడానికి విద్యార్థులు కష్టపడి చదవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కరకగూడెం మండలంలోని

X
దిశ, కరకగూడెం : ఉన్నత లక్ష్యాలు సాధించడానికి విద్యార్థులు కష్టపడి చదవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కరకగూడెం మండలంలోని నూతనంగా ఏర్పాటు అయినటువంటి నవోదయ విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా సోమవారం సందర్శించారు. విద్యాలయంలో పరిసరాలను పరిశీలించి, స్టోర్ గదిని పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. తరగతి గదులో ఉన్న విద్యార్థులతో మాట్లాడుతూ.. ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని, వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. టీచర్స్ విద్యార్దులకు అర్థమయ్యే విధంగా విద్యను బోధించాలని తెలిపారు. పరిశీలనలో కలెక్టర్ వెంట నవోదయ పాఠశాల ఇంచార్జి భాస్కర చారి, మండల విద్యాశాఖ అధికారి మంజుల, తహసీల్దార్ ఘంటా ప్రతాప్, ఎంపీవో మారుతీ, ఆర్ఐ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






