కాకరవాయి చేపల చెరువు వద్ద ఘర్షణ...

by Kodari Anjali |

చేపల చెరువు విషయంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో పలువురికి గాయాలైన ఘటన బుధవారం తిరుమలాయపాలెం మండలంలో చోటు చేసుకుంది.

కాకరవాయి చేపల చెరువు వద్ద ఘర్షణ...
X

దిశ, తిరుమలాయపాలెం: చేపల చెరువు విషయంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో పలువురికి గాయాలైన ఘటన బుధవారం తిరుమలాయపాలెం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలపరిధిలోని కాకరవాయి గ్రామంలోని మద్దుల చెరువులో బుధవారం ఓ వర్గం చేపలు పడుతుండగా మరో వర్గం నిరాకరించింది. ఈ విషయమై ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి పెద్ద ఘర్షణ జరిగింది. దీంతో గతంలో చెరువులో వినాయకుని విగ్రహాలు నిమజ్జనం చేయగా, అట్టి బొమ్మల కర్రలతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంమే కాకా రాళ్లు సైతం రువ్వుకున్నారు. ఈ దాడిలో ఇరువర్గాల పురుషులతో పాటు, మహిళలు సైతం గాయపడ్డారని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘర్షణ స్థలానికి చేరుకొని శాంతి భద్రతలు కాపాడారు. ఈ ఘర్షణ పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story