పేద విద్యార్థులకు చౌదరి అసోసియేషన్ చేయూత

by velandi.Saikiran |

కష్టపడి చదివే గుణం ఉండి, పేదరికం కారణంగా వెనకబడుతున్న విద్యార్థులను ఆదుకునేందుకు చౌదరి వెల్ఫేర్ అసోసియేషన్

పేద విద్యార్థులకు చౌదరి అసోసియేషన్ చేయూత
X

దిశ, దమ్మపేట: కష్టపడి చదివే గుణం ఉండి, పేదరికం కారణంగా వెనకబడుతున్న విద్యార్థులను ఆదుకునేందుకు చౌదరి వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకొచ్చింది. కమ్మ సేవా సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అరికెపూడి గాంధీ, తాళ్లూరి జీవన్ ఆధ్వర్యంలో ఆదివారం దమ్మపేట, మందలపల్లి సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. మండల పరిధిలోని ఐదుగురు విద్యార్థులు ఈలప్రోలు ఈశ్వర సాయిరాం, మేకా భార్గవ్, మల్లెంపల్లి చందన్, వల్లభనేని సాహితీ, పునుకొల్లు రిషితలకు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 50,000 నగదును అందజేశారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు పోతినేని శ్రీరామ వెంకటరావు మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని, వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గడ్డిపాటి సత్యం, వజ్జా శ్రీనివాసరావు, అల్లాడ రమాదేవి, కొంకా శ్రీనివాసరావు, యలమర్తి కిషోర్ కుమార్, బొల్లా మోహన్ రావు, పెనికెలపాటి కృష్ణయ్య, పెనికలపాటి హరినాయుడు, పారుపల్లి భద్రం, తూమాటి మల్లేశ్వరరావు, పారుపల్లి రజిని, ఈలప్రోలు కిరణ్ బాబు, యర్ర వసంతం తదితరులు పాల్గొన్నారు.

Next Story