చెన్నకేశవ యూత్ కమిటీ లడ్డూ లాటరీ

by velandi.Saikiran |

చింతకాని మండల కేంద్రంలోని శ్రీ చెన్నకేశవ స్వామి టెంపుల్ రోడ్ వద్ద 4వ వార్షికోత్సవం సందర్భంగా, చెన్నకేశవ యూత్ ఆధ్వర్యంలో

చెన్నకేశవ యూత్ కమిటీ లడ్డూ లాటరీ
X

దిశ చింతకాని: చింతకాని మండల కేంద్రంలోని శ్రీ చెన్నకేశవ స్వామి టెంపుల్ రోడ్ వద్ద 4వ వార్షికోత్సవం సందర్భంగా, చెన్నకేశవ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక విగ్రహం దగ్గర లడ్డు లాటరీ శుక్రవారం నిర్వ‌హించారు. మండల ప్రెస్ క్లబ్ కార్యదర్శి దిశ రిపోర్టర్ వెన్నబోయిన సురేందర్ నది, ధాత్రిక పత్రిక రిపోర్టర్ దునుకుల వీరేందర్(DVS) స్వామి వారి లాటరీని ప్రారంభించారు.

ఇందులో మొదటి లాటరీ టోకెన్ లో ఆముదాల గోవిందరావు కైవసం చేసుకున్నారు. రెండవ లాటరీ టోకెన్ చెరుకుపల్లి అరుణ, మూడవ టోకెన్ నరసింహాపురం గ్రామానికి చెందిన ఉప్పెల్లి గోపయ్య లు ద‌క్కించుకున్నారు. ఈ త‌రుణంలోనే... కమిటీ సభ్యులు లడ్డు ని ఆముదాల గోవిందరావు కి అందజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నకేశవ యూత్ అధ్యక్షుడు ఉప్పెల్లి నాగార్జున,ఉపాధ్యక్షుడు గంధసిరి రాజేష్,కమిటీ సభ్యులు కౌశిక్,చరణ్,చరణ్ వినయ్, గౌతమ్,రామకృష్ణ,శేఖర్ మరియు భక్తులు కామగాణి బుచ్చయ్య,గంధసిరి శ్రీను,కొంపెల్లి శ్రీను,గడ్డం వెంకటేశ్వర్లు,గంధసిరి ఉన్నారు.

Next Story