- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామానగరం కొత్తకట్ట, సిద్ధారెడ్డి కాల్వలపై బ్రిడ్జిలు నిర్మించాలి
రామానగరం కొత్తకట్ట, సిద్ధారెడ్డి కాలువలపై బ్రిడ్జిలు నిర్మించాలని సీపీఐ, కాంగ్రెస్ నాయకులు తహ

దిశ, సత్తుపల్లి : రామానగరం కొత్తకట్ట, సిద్ధారెడ్డి కాలువలపై బ్రిడ్జిలు నిర్మించాలని సీపీఐ, కాంగ్రెస్ నాయకులు తహసీల్దారు పున్నం సత్యనారాయణను కోరారు. సోమవారం ఆ కాలువల పరిశీలనకు వచ్చిన తహసిల్దారును కలిసిన సీపీఐ, కాంగ్రెస్ నాయకులు దండు ఆదినారాయణ, ఒంటెద్దు సాయిలు కొత్తకట్ట, సిద్ధారెడ్డి కాలువపై బ్రిడ్జి నిర్మాణాల ఆవశ్యకతను వివరించారు. రామానగరం గ్రామానికి ఆనుకొని ఉన్న కొత్తకట్ట, సిద్ధారెడ్డి వరద కాలువలపై బ్రిడ్జి నిర్మించడం ద్వారా వర్షాల సమయంలో రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు.
ప్రతి సంవత్సరం అక్కడ ఏర్పాటు చేస్తున్న తూరలు వరదలకు కొట్టుకొని పోవడం వల్ల కట్టతెగి, గండ్లుపడి రైతులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారన్నారు. పొలాల్లో మట్టి, ఇసుక మేటలు పడి రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతున్న నేపథ్యంలో బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని ఆదినారాయణ, సాయిలు తహసిల్దారు సత్యనారాయణను కోరారు. రైతులు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొత్తకట్ట, సిద్ధారెడ్డి కాలువలపై బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తహసిల్దారును కలిసిన వారిలో సీపీఐ నాయకులు పాలకుర్తి వీరయ్య, ఎర్రజల రాజశేఖర్, ప్రజలు, గ్రామపంచాయతీ కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు.






