- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్తు కోసం చోరీలు.. భద్రాద్రిలో బైకులు మాయం
భద్రాచలం పుణ్యక్షేత్రంలో ద్విచక్ర వాహన దొంగతనాలు రోజు రోజుకు పెరగడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భద్రాచలం పుణ్యక్షేత్రంలో కొందరు యువత మత్తు కోసం దొంగతనాలకు పాల్పడుతున్నారు. పుణ్యక్షేత్రంలో ద్విచక్ర వాహన దొంగతనాలు రోజు రోజుకు పెరగడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పట్టణంలో వ్యాపారులు, పలు సంస్థలు, సంఘాల ఆర్థికసాయంతో లక్షలాది రూపాయలు వెచ్చించి నిఘా వ్యవస్థ పెంచినా... పట్టపగలే ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయి. ఇటీవల సుమారు 10బైకులు మాయమయ్యాయి. విచ్చలవిడిగా గంజాయి లభ్యం కావడం, ప్రతి వీధిలో పది బెల్టు షాపులు ఉండటంతో కొందరు యువత మత్తులో జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్నారు. గతంలో దొంగిలించిన వాహనాలను చింతూరు, చట్టి, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాలలో విక్రయించేవారు. ఇప్పుడు భద్రాచలం పట్టణానికి చెందినవారే కొందరు వాహనాల దొంగలకు సపోర్ట్ చేస్తున్నారని, వాహనాల రూపు రేఖలు మార్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి.
దిశ, భద్రాచలం: గంజాయి, మద్యం మత్తు కోసం కొందరు యువత పెడదోవ పడుతున్నారు. జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా గంజాయి లభ్యం కావడం, ప్రతి వీధిలో పది బెల్టు షాపులు ఉండటంతో యువత మత్తుకు బానిసలవుతున్నారు. గంజాయి మత్తులో మర్దర్స్ చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఈ మధ్య కాలంలో రెండు హత్యలు అలా జరిగినవే. కైపు కోసం తేలిగ్గా వాహనాలను దోచేస్తూ వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు.
రూపు రేఖలు మార్చి విక్రయం
భద్రాచలం పుణ్యక్షేత్రంలో ద్విచక్ర వాహన దొంగతనాలు రోజు రోజుకు పెరగడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పట్టణంలో వ్యాపారులు, పలు సంస్థలు, సంఘాల ఆర్థికసాయంతో లక్షలాది రూపాయలు వెచ్చించి నిఘా వ్యవస్థ పెంచినా... పట్టపగలే ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయి. ఈ మధ్య కాలంలో సుమారు 10బైకులు మాయం కాగా సోమవారం రాత్రి ముదిరాజ్ బజార్‌లో ఇంటిముందు పార్క్ చేసిన పల్సర్ వాహనం మాయం అయింది. గతంలో దొంగిలించిన వాహనాలను చింతూరు, చట్టి, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాలలో విక్రయించేవారు. ఇప్పుడు భద్రాచలం పట్టణానికి చెందినవారే కొందరు వాహనాల దొంగలకు సపోర్ట్ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాహనాల రూపు రేఖలు మార్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి.
పని చేయని నిఘా వ్యవస్థ..
వాహనాలు దొంగ పట్టుబడినప్పుడు అతని దగ్గర నుంచి పోలీసులు వాహనాలు రికవరీ చేయడం కాకుండా, వాహనం పోయిందని పిర్యాదు అందిన వెంటనే సీసీ కెమెరాల ద్వారా, ఆ వాహనం ఎటువైపు వెళ్లిందో అన్వేషించాల్సిన అవసరం ఉంది. దీనికోసం పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్ని సీసీ కెమెరాలు ఎల్లప్పుడూ పనిచేసేలా చూడాల్సిన బాధ్యత డిపార్ట్‌మెంట్‌పై ఉంది. ఇటీవల కాలంలో ఒక వ్యాపారి ఐటీడీఏ రోడ్‌లో బ్యాంకులో నగదు డిపాజిట్ చేయడానికి ద్విచక్ర వాహనంపై తీసుకుని వస్తుండగా, పొరపాటున నగదు రోడ్డుపై పడిపోవడంతో.. ఆ నగదు నుంచి రూ.2.5లక్షలు మాయం అయ్యాయి. వెంటనే పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీనికి కారణం ఆ సమయంలో, ఆ ప్రాంతంలో పోలీస్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసిన సి సి కెమెరాలు పని చేయలేదు. పోలీస్ నిఘా పటిష్టంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే యువతకు గంజాయి సరఫరా చేసే వ్యక్తులపై ఎక్సయిజ్, పోలీస్ శాఖలు ప్రత్యేక ద్రుష్టి పెడితే చాలా నేరాలను అరికట్టవచ్చని ప్రజలు కోరుకుంటున్నారు.






