- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి తుమ్మలకు షాక్.. రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ మద్దతుదారుల గెలుపు
మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా షాక్ నిచ్చాయి. ఈ మండలంలో మొత్తం 37గ్రామ పంచాయతీలుండగా..

మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా షాక్ నిచ్చాయి. ఈ మండలంలో మొత్తం 37గ్రామ పంచాయతీలుండగా.. అందులో 5 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 32పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గతంలో ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో అనూహ్యంగా బీఆర్ఎస్ జెండా ఎగిరింది. 11మంది బీఆర్ఎస్ మద్దతుదారులుగా ఉన్న సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందడం విశేషం. కాంగ్రెస్ పార్టీలో రెబెల్స్ బెడద, నాయకుల మధ్య సమన్వయం కొరవడటం, వారి వ్యవహారశైలి కారణంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో పుంజుకుంటుందన్న చర్చ సాగుతుంది. ఆశించిన మేర సర్పంచ్ స్థానాలు గెలవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సహం కనిపిస్తున్నది.
దిశ బ్యూరో, ఖమ్మం: మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా షాక్ నిచ్చాయి. ఈ మండలంలో మొత్తం 37గ్రామ పంచాయతీలుండగా.. అందులో 5 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 32పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గతంలో ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో అనూహ్యంగా బీఆర్ఎస్ జెండా ఎగిరింది. 11సీట్లు బీఆర్ఎస్ మద్దతుదారులుగా ఉన్న సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందడం విశేషం. కాంగ్రెస్ పార్టీలో రెబెల్స్ బెడద, నాయకుల మధ్య సమన్వయం కొరవడటం, వారి వ్యవహారశైలి కారణంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో పుంజుకుంటుందన్న చర్చ సాగుతుంది. ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆశించిన మేర సర్పంచ్ స్థానాలు గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులు, శ్రేణులు జోష్ లో ఉన్నారు. ఈ మేరకు గెలిచిన అభ్యర్థులకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు తాత మదుసూధన్ శుభాకాంక్షులు తెలిపారు.
సర్పంచులుగా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులు వీరే..
రఘునాథపాలెం మండలం లచ్చిరాం తండా బీఆర్ఎస్ మద్దతుదారు మాలోత్ సుశీల 42ఓట్లతో విజయం సాధించారు. ఎన్వీ బంజర బీఆర్ఎస్ మద్దతుదారు జర్పుల సౌందర్య 129ఓట్లతో గెలవగా.. కేవీ బంజర బీఆర్ఎస్ మద్దతుదారు భూక్యా సరిత 32 ఓట్లు మెజార్టీ సాధించారు. మూలగూడెం బీఆర్ఎస్ మద్దతుదారు జర్పుల రవీందర్ 79ఓట్లతో గెలుపొందగా, జీకే బంజర అభ్యర్థి మాలోత్ జ్యోతి 84 ఓట్లతో విజయం సాధించారు. రాంక్యాతండా బీఆర్ఎస్ మద్దతుదారు గుగులోత్ మూర్తి 45ఓట్లతో గెలుపొందారు. శివాయిగూడెం బీఆర్ఎస్ మద్దతుదారు బానోత్ సునీత 68 ఓట్లతో గెలుపొందగా..మంచుకొండ అభ్యర్థి మాలోత్ శంకర్ 270ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వేపకుంట్ల బీఆర్ఎస్ మద్దతుదారు పోట్లపల్లి రమాదేవి 219ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కోటపాడు బీఆర్ఎస్ మద్దతుదారు కొంటెముక్కల వెంకటేశ్వర్లు 38ఓట్ల మెజార్టీ సాధించి గెలుపొందారు. ఇక నువ్వా నేనా అన్నట్లు సాగిన బద్యాతండా కౌంటింగ్‌లో చివరికి ఒక్క ఓటుతో బీఆర్ఎస్ మద్దతుదారు నునావత్ పెంట్యా గెలుపొందడం విశేషం.






