- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రాచలం దేవాలయం ఈవో రమాదేవిపై బదిలీ వేటు
by Muthe.Rajitha |
భద్రాచలం శ్రీరామచంద్ర దేవస్థాన ఆలయ ఈవో రమాదేవిపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం.

X
దిశ, వెబ్ డెస్క్ : భద్రాచలం శ్రీరామచంద్ర దేవస్థాన ఆలయ ఈవో రమాదేవిపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. కాగా నేడు రాష్ట్రంలో 12 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ బదిలీల్లో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అయిన రమాదేవి కూడా ఉన్నారు. ఆమెను రహదారుల, భవనాల శాఖకు డిప్యూటేషన్ పై పంపింది ప్రభుత్వం. కాగా భద్రాచలం దేవాలయం ఈవోగా విధులు నిర్వహించిన రమాదేవి చాలా కఠినంగా వ్యవహరిస్తారని పేరు ఉంది. పలుమార్లు ఆలయ భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకున్నారు. ఇటీవల ఇలాంటి వివాదంలో కబ్జాదారుల చేతుల్లో దెబ్బలు కూడా తిన్నారు. అలాగే ఆలయ వ్యవహారాల్లో, నియమాల్లో నిక్కచ్చిగా ఉండటం నచ్చక కొందరు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆమెను బదిలీ చేయించారని చర్చ నడుస్తోంది.
Next Story






