- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
15 గంటల పాటు భద్రాచలం రామాలయం దర్శనాలు బంద్
భద్రాచలం రామాలయం దర్శనాలు బంద్ కానున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో 15 గంటలు పా

X
దిశ, భద్రాచలం: భద్రాచలం రామాలయం దర్శనాలు బంద్ కానున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో 15 గంటలు పాటు దర్శనాలు నిలిపివేయనున్నారు. సెప్టెంబర్ 7 న పాక్షిక చంద్ర గ్రహణం పురస్కరించుకొని ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి మరుసటి రోజు తెల్లవారు జాము 3 గంటల వరకూ రామాలయం తలుపులు మూసివేయనున్నారు. 8వ తేది తెల్లవారు జాము 3 గంటలకు సుప్రభాతం, ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, ఆరాధన, సేవాకాలం, నివేదన తర్వాత ఉదయం 7.30 గంటల నుండి స్వామి వారి దర్శనాలు ప్రారంభం అవుతాయని ఆలయ ఈ ఓ దామోదర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.
Next Story






