Ponguleti Srinivasa Reddy : నవ శకానికి నాంది : పొంగులేటి

by Sridhar Babu |   (  Updated:2023-12-03 12:24:11  IST  )

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలు నవశకానికి నాంది పలుకుతూ మొత్తం పది సీట్లకు గాను 9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం హర్షణీయమని కాంగ్రెస్ పాలేరు అసెంబ్లీ విజేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

Ponguleti Srinivasa Reddy : నవ శకానికి నాంది : పొంగులేటి
X

దిశ, ఖమ్మం రూరల్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలు నవశకానికి నాంది పలుకుతూ మొత్తం పది సీట్లకు గాను 9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం హర్షణీయమని కాంగ్రెస్ పాలేరు అసెంబ్లీ విజేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో 56,460 ఓట్ల భారీ మెజారిటీ తో పాలేరులో తనను గెలిపించిన ప్రజలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో నిరంకుశ బీఆర్ఎస్ పాలకులను ఇంటికి సాగనంపి కాంగ్రెస్ కు పట్టం కట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. పాలేరు తో పాటు మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అధికారాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం ద్వారా సుపరిపాలన అందించి వారి రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Next Story