నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి : మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్

by Nallavelli.Anjaneyulu |

దిశ, మధిర : జాతీయస్థాయిలో జవహర్ నవోదయ విద్యాసంస్థల్లో ప్రవేశం కొరకు మధిర టీవీఎం ఉన్నత పాఠశాలలో శనివారం

నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి  : మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్
X

దిశ, మధిర : జాతీయస్థాయిలో జవహర్ నవోదయ విద్యాసంస్థల్లో ప్రవేశం కొరకు మధిర టీవీఎం ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించబోయే ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మధిర మండల విద్యాశాఖ అధికారి వై. ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం మధిర టీవీఎం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నవోదయ పరీక్ష ప్రవేశ పరీక్షకు ఇంగ్లీష్ మీడియం నుంచి 138 మంది తెలుగు మీడియం నుంచి 30 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. నవోదయ ప్రవేశ పరీక్షకు హాజరు కానున్న విద్యార్థుల హల్ టికెట్ లో టీవీఎం ఉన్నత పాఠశాలకు బదులు టీవీఎం గర్ల్స్ ఉన్నత పాఠశాల గా నమోదు అయింది కావున విద్యార్థులందరూ మెయిన్ రోడ్ లోని టీవీఎం ఉన్నత పాఠశాల ఒకటే పరీక్షా కేంద్రం కావున అందరూ సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 11:30 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు. ఈ పరీక్షలకు పాలేరు నవోదయ నవోదయ విద్యాలయ సమితికి చెందిన టీ జ్యోతిర్మయి సెంట్రల్ లెవెల్ అబ్జర్వర్ గా, మధిర మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్ బ్లాక్ లెవర్ అబ్జర్వ్ గా, పెన్మత్స భీమరాజు సెంటర్ సూపరింటెండెంట్ గా వ్యవహరించనున్నారు.

Next Story