- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫైల్ కదలాలంటే పైసలే..
ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫైల్ కదలాలంటే పైసలే..
ప్రతీ ఫైల్‌కు ఓ రేటు.. ఇస్తే ఓకే.. లేదంటే పెండింగ్
ఖమ్మం రవాణాశాఖ కార్యాలయాన్ని గుప్పెట పట్టిన ఓ అధికారి
ప్రైవేట్ ఏజెంటు ద్వారా వసూళ్ల పర్వం
పని చేయాలంటే చేయి తడపాల్సిందే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు కొందరు అధికారులు. ప్రభుత్వ జీతం తీసుకుంటు చేయాల్సిన పనిని కూడా డబ్బుల ఇస్తేనే చేస్తామనే ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఖమ్మంలోని రవాణాశాఖ కార్యాలయంలో ఓ అధికారి తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పరిపాలనా పరంగా పూర్తిస్థాయిలో అవగాహన ఉండటంతో కార్యాలయంలో ఇతను ఆడింది ఆటగా.. పాడింది పాటగా సాగుతుందని కార్యాలయ సిబ్బందే చెబుతున్నారు. ఉన్నతాధికారులకు తెలిసే ఈ దందా యథేచ్ఛగా సాగిస్తున్నట్లు కార్యాలయంలో కోడై కూస్తుంటే.. కార్యాలయంలో పనుల కోసం వచ్చేవారి నుంచి డబ్బులు వసూలు చేయడం కోసం ఏకంగా ఓ ప్రైవేట్ వ్యక్తినే నియమించుకోవడం గమనార్హం.
దిశ, ఖమ్మం : ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో జరుగుతున్న వసూళ్ల దందా అధికారులకు తెలిసి జరుగుతుందా అంటే.. అవును అని చెప్పక తప్పదు. ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో వచ్చే ప్రతి ఫైల్‌కు రేటు ఫిక్స్ చేసి వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ చనిపోవడంతో ఈ పోస్ట్‌కు అక్కడే విధులు నిర్వహిస్తున్న సివియర్ అసిస్టెంట్‌కు ఇన్‌చార్జి ఏవోగా ఇచ్చారు. అదే అదునుగా భావించి కార్యాలయంలో అతను కలెక్షన్ కింగ్ అవతారమెత్తి ప్రతి ఫైల్‌కు రేటు ఫిక్స్ చేశాడు. ఆర్టీఏ కార్యాలయంలో ఏ ఫైల్ వచ్చినా అతనికి చెబితేనే ఫైల్ కదిలే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నాడు. గతంలో ఇతను పనిచేసిన మహబూబాబాద్, కొత్తగూడెంలో కూడా వసూళ్ల చేయడంలో ఆరితేరినవాడు అని సిబ్బందే బహిరంగంగా చెబుతున్నారు.
ప్రతి ఫైల్‌కు రేటు...
ఆర్టీఏ కార్యాలయంలో వచ్చే ప్రతి ఫైల్‌కు రేటు ఫిక్స్ చేసి వసూళ్ల పర్వం సాగుతున్నట్లు కనిపిస్తోంది. కార్యాలయంలో వాహన రిజిస్ట్రేషన్, సెకండ్ వాహన రిజిస్ట్రేషన్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. వివిధ సెక్షన్ నుంచి వచ్చే ప్రతి ఫైల్ అతనికి చెప్పి పెట్టాలి, చెప్పకుండా ఫైల్ పెడితే ఫైల్ పెండింగ్‌లో పడుతుంది. ఫైల్‌కు అది లేదు.. ఇది లేదు అంటూ సవాలక్ష కొర్రీలు పెడుతూ ఫైల్ అంతే పెండింగ్లో పెడుతున్నారు. కార్యాలయంలో ఇతను చేస్తున్న వసూళ్ల పర్వంతో సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ప్రైవేట్ ఏజెంట్ ద్వారా వసూళ్లకు పర్వం..
రవాణాశాఖ కార్యాలయానికి వచ్చే ప్రతి ఫైల్‌పై వసూళ్లను ప్రైవేట్ ఏజెంట్ ద్వారా కలెక్షన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రతి రోజు వచ్చినా కలెక్షన్ సాయంత్రం ప్రైవేట్ ఏజెంట్ కలెక్షన్ కింగ్ ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ప్రతి రోజూ సుమారు రూ.50నుంచి లక్ష రూపాయల వరకు వసూళ్ల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీఏ కార్యాలయాల్లో ఫిర్యాదుల మేరకు ఏసీబీ సోదాలు జరుగుతున్నా మళ్లీ వసూళ్ల పర్వం సాగుతున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.
మారని తీరు..?
ఆర్టీఏ కార్యాలయంలో కలెక్షన్ కింగ్ పై ఓ వాహనదారుడు చేయి చేసుకున్నట్టు తెలుస్తుంది. తన వాహనం పనిపై వారం రోజులుగా పని కాకపోవడంతో సహనం కోల్పోయిన అతను చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ఇతను మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. మహబూబాబాద్ నుంచి బదిలీపై ఖమ్మం ఆర్టీఏ కార్యాలయం వచ్చిన కూడా అతని వసూళ్ల పర్వం కొనసాగుతోందని సిబ్బంది బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ఈ కలెక్షన్ కింగ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కార్యాలయానికి వచ్చే వాహనదారులు కోరుతున్నారు.






