MPTC, ZPTC ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

by velandi.Saikiran |

ఈ నెల 23న జరగబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎలక్షన్స్‌ పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీజ ఆదేశాలు

MPTC, ZPTC ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
X

దిశ, తిరుమలాయపాలెం: ఈ నెల 23న జరగబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎలక్షన్స్‌ పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీజ ఆదేశాలు ఇచ్చారు. శనివారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని, మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ శ్రీజ సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్వోస్, నామినేషన్ పత్రాలను పరిశీలించారు. అనంత‌రం ఆడీషనల్ కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ...ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని పలు సూచనలు చేశారు. ఎంపీడీవో షేక్.సిలార్ సాహెబ్, సూపరింటెండెంట్ శారదా దేవి, సీనియర్ అసిస్టెంట్ మీరా, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Next Story