- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దంపతుల హత్య కేసులో నిందితుడికి ‘జీవితకాల’ జైలు శిక్ష
సంచలనం సృష్టించిన దంపతుల హత్య కేసులో నిందితుడికి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.

దిశ, దమ్మపేట : సంచలనం సృష్టించిన దంపతుల హత్య కేసులో నిందితుడికి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్జి వసంత్ పాటిల్ తీర్పునిచ్చారు. దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం గ్రామంలో 2022లో గుడిమెట్ల సుబ్బలక్ష్మి, గుడిమెట్ల గురువారావు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు మల్లవరపు శ్రీనివాసరావును నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి, నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవితకాల కారాగార శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసులో శాస్త్రీయంగా విచారణ జరిపి కోర్టు ముందు పక్కా ఆధారాలు ప్రవేశపెట్టిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బాలకృష్ణ (సి.ఐ)ను, అలాగే ట్రయల్ సమయంలో సాక్షులను సమన్వయం చేస్తూ నిందితుడికి శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించిన కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్ ని ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు. వీరితో పాటు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, అశ్వారావుపేట సీఐ కూడా కానిస్టేబుల్ పనితీరును ప్రశంసించారు. నేరస్తులకు శిక్ష పడటం వల్ల బాధితులకు న్యాయం చేకూరినట్లయిందని అధికారులు పేర్కొన్నారు.






