- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇసుక ర్యాంపుల్లో రహదారుల నిర్మాణం ఏ నిబంధన ప్రకారమో..?
మణుగూరు మండలంలోనీ తిర్లాపురం ఇసుక ర్యాంపులో బడా బాబుల, కాంట్రాక్టర్ల హవా జోరుగా నడుస్తోందని రేణుక అక్షర మండల కమిటీ అధ్యక్షురాలు పూనెం సరోజ అన్నారు.

దిశ, మణుగూరు : మణుగూరు మండలంలోనీ తిర్లాపురం ఇసుక ర్యాంపులో బడా బాబుల, కాంట్రాక్టర్ల హవా జోరుగా నడుస్తోందని రేణుక అక్షర మండల కమిటీ అధ్యక్షురాలు పూనెం సరోజ అన్నారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సొసైటీ ర్యాంపుల్లో ఇసుక తీసుకెళ్లేందుకు లారీలకు దారులు వేయడం ఏ నిబంధన ప్రకారం జరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యం పర్యవేక్షిస్తున్నామని చెప్పే టిజిఎండిసి అధికారులకు గోదావరి తల్లిని ఇబ్బందులకు గురి చేసే విధంగా ఏర్పాటు చేసిన రహదారులు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. గోదావరి లో ఇసుక నాణ్యత పరిశీలన కోసం తీసిన గుంతలు తిరిగి పూడ్చకపోవడం వల్లే యువకుడి మృతి చోటు చేసుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పని వారికి కనీసం రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో పుట్టి పొట్ట కూటి కోసం వచ్చిన వారికి పని సమయంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా సొసైటీల్లోకి చొరబడిన బడా కాంట్రాక్టర్ల కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించాల్సిన ర్యాంపులు శ్రమ దోపిడీ కేంద్రాలుగా మారాయన్నారు. ఏజెన్సీ ఏరియాలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, బడా కాంట్రాక్టర్ ను తరిమికొట్టేందుకు కదిలి రావాలని ఆదివాసీ సంఘాలు, దళిత సంఘాలు ఈ ఘటన పై వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు. కలెక్టర్ ఈ ఘటనపై వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని ఆమె కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చి మృతి చెందిన బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాలంటే రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖలతో సంయుక్త విచారణ జరపాలని డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో రేణుక అక్షర మహిళా మండలి సభ్యులు ఎండి షబానా ,కోరి శ్యామల, కన్నాపురం వసంత ,రెడ్డిబోయిన రేణుక , బాడిష పార్వతి, సౌజన్య డాకూరి పాల్గొన్నారు.






