పార్క్ లో జింకల పై కాల్పుల కలకలం

by Ratna Kumari |

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణ పరిధిలో వేంసూరు రోడ్డు లో గల సుమారు 375 ఎకరాల విస్తీర్ణంలో పర్యావరణ సమతుల్యతకు, స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటుచేసిన నీలాద్రి అర్బన్

పార్క్ లో జింకల పై కాల్పుల కలకలం
X

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణ పరిధిలో వేంసూరు రోడ్డు లో గల సుమారు 375 ఎకరాల విస్తీర్ణంలో పర్యావరణ సమతుల్యతకు, స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటుచేసిన నీలాద్రి అర్బన్ పార్క్ లో ఉన్న జింకలు వరుసగా వీధి కుక్కల బారిన పడి మృతి చెందటంతో పాటు ఇటీవల సత్తుపల్లి అర్బన్ పార్కులోకి అగంతుకులు చోరబడి గన్ తోని జింకలు ను కాల్చినట్లు జిల్లా ఫారెస్ట్ అధికారికి పలువురు ప్రియాతి చేయగా ఈ విషయం పత్రికలు మీడియా ఛానల్ లో ప్రచారం జరగడంతో వన్యప్రాణి ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్తుపల్లి ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే వరుస జింకలు వీధి కుక్కల బారిన పడుతున్నాయని దీనికి తోడు ఇటీవల ఓ వేడుకకు అర్బన్ పార్క్ లో ఉన్న జింకలను గన్ తో కాల్చి వేడుక కు విచ్చేసిన విఐపి లకు వడ్డించారనే జిల్లా ఫారెస్ట్ అధికారికి ఫిర్యాదులు అందగా ఫిర్యాదులపై విచారణ నిమిత్తం జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులను విచారణ నిమిత్తం నీలాద్రి అర్బన్ పార్కు ను సందర్శించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ వార్త తో పర్యావరణ జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విచారణ చేపట్టిన జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు

సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్ నందు ఉన్న జింకల పై గన్ తో కాల్చి చంపారని.. దీనికి స్థానికంగా ఉన్న ఫారెస్ట్ అధికారుల సహాయ సహకారంతో జింకలపై కాల్పులు జరిపారని ఫిర్యాదు అందగా జిల్లా ఫారెస్ట్ అధికారి విచారణ అధికారులుగా టాస్క్ఫోర్స్ అధికారులను సత్తుపల్లికి పంపి వివరాలకు సేకరిస్తున్నారు. జిల్లా నుంచి సత్తుపల్లికి విచ్చేసిన టార్క్ ఫోర్స్ అధికారులు నీలాద్రి అర్బన్ పార్కు లో పలు ప్రాంతాలను సందర్శించి పలు వివరాలను సేకరించారు. స్థానికంగా ఉన్న రేంజ్ లో ఆఫీసర్ బీట్ ఆఫీసర్ నుంచి వివరాలు సేకరించి పలు ప్రాంతాలలో పర్యటించారు. వన్యప్రాణులకు రక్షణగా ఉండవలసిన కొందరు ఫారెస్ట్ అధికారులు జింకల వేటకు సహాయ సహకారాలు అందించడం పై వన్య ప్రాణ ప్రేమికుల నుంచి సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కంచె చేను మేసిన సామెతగా ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు జింకల మృతిపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ చేపట్టి అగంతకులకు సహకరించిన అధికారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వన్య ప్రాణ ప్రేమికులు, స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. మీడియాకు వివరాలు వెల్లడించేందుకు జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు విముఖత శనివారం సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్కు విచారణ నిమిత్తం జిల్లా ఫారెస్ట్ టాస్క్ఫోర్స్ అధికారులు సందర్శన సమయంలో మీడియాకు సంఘటన స్థలాలకు వెళ్లేందుకు మీడియాకు అనుమతించకపోవడం పై మీడియా ప్రతినిధులు సదరు అధికారిని ప్రశ్నించగా జరిగిన సంఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపిన తర్వాత మీడియాకు వివరాలు వెల్లడిస్తామని, సంఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నామని దర్యాప్తు పూర్తయిన వెంటనే వివరాలు వెల్లడిస్తామని ఓ అధికారి తెలిపారు.

Next Story