మోడీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న రూరల్ మండల వాసి

by velandi.Saikiran |

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా శనివారం ఢిల్లీలో ఖమ్మం జిల్లా రూరల్‌ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన

మోడీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న రూరల్ మండల వాసి
X

దిశ, ఖమ్మం రూరల్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఖమ్మం జిల్లా రూరల్‌ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన యువతి తాళ్లూరి పల్లవి శనివారం అవార్డును అందుకున్నారు. ఏఐ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినoదుకు గాను (AIPA (Artificial intelligence programming assistant) విభాగంలొ ఈ అవార్డును అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కౌశల్ దీక్షాంత్ సమరోహ్‌లో ప్రధాని యువతలో స్కిల్ డెవలప్‌మెంట్, ఉద్యోగ నైపుణ్యాల్ని పెంచేందుకు ప్రధాన మంత్రి సేతు (PM-SETU) పథకాన్ని రూ. 60,000 కోట్లతో ప్రవేశపెట్టారు.

దీనిలొ బాగంగానే అత్యుత్తమ నైపుణ్యం కనపరిచిన పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్దులకు అవార్డులను ప్రదానం చేశారు. దీనిలొ భాగంగానే ఆర్టిపిషియల్ ఇంటలీజెన్స్‌ విభాగంలొ ఆల్‌ ఇండియా ట్రేడ్‌ టాపర్‌ గా ఎంపికైన తాళ్లూరి పల్లవికి ప్రధాని మోడీ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా పల్లవి తల్లిదండ్రులు తాళ్లూరి రవి, అజిత అనందం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న తాలూరి పల్లవిని ఆరంపుల గ్రామస్తులు అభినందిస్తున్నారు.

Next Story