- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనంతో కిక్కిరిసిన కైకొండాయ గూడెం
ప్రచారమా.. ఇప్పుడే విజయోత్సవ ప్రదర్శనా అన్నట్లుగా పాలేరు కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కైకొండాయి గూడెంలో జనం తండోపతండాలుగా తరలివచ్చారు.

దిశ,ఖమ్మం రూరల్: ప్రచారమా.. ఇప్పుడే విజయోత్సవ ప్రదర్శనా అన్నట్లుగా పాలేరు కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కైకొండాయి గూడెంలో జనం తండోపతండాలుగా తరలివచ్చారు. మంగళవారం వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ప్రదర్శన తీశారు. సీపీఐ, టీడీపీ శ్రేణులు కదిలివచ్చి.. మేము సైతం అంటూ తోడయ్యారు. జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి హాజరవ్వగా.. బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రదర్శనలో మహిళలు, యువతీ యువకులు వెంట నడిచి జై శ్రీనన్న.. జై కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తించారు.
పొంగులేటి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..: డివైడర్, సెంట్రల్ లైటింగ్, శ్మశాన వాటిక, ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్య తీవ్రంగా ఉందని, బీఆఆర్ఎస్ పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, మీ శీనన్న ఎంతో అభివృద్ధి చేస్తారని అభయమిచ్చారు. గుర్తుంచుకోండి ఈనెల 30న జరిగే పోలింగ్లో అందరూ బాధ్యతగా పాల్గొనాలని, ఈవీఎమ్‌లో 3వ నంబర్ హస్తం గుర్తుపై ఓటేసి మీ శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉపేందర్, కార్పొరేటర్ హుస్సేన్, కృష్ణయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






