- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూతురే కొడుకు అయిన వేళ
by velandi.Saikiran |
ఓ కూతురే తన తండ్రికి కొడుకై తలకొరివి పెట్టంది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలోని పాత చర్ల అంబేద్కర్ నగర్ లో జరిగింది.

X
దిశ చర్ల : ఓ కూతురే తన తండ్రికి కొడుకై తలకొరివి పెట్టంది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలోని పాత చర్ల అంబేద్కర్ నగర్ లో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబేద్కర్ నగర్ గ్రామానికి చెందిన చింతల రాంబాబు - కమల కుమారి దంపతులకు ఒక కుమార్తె భారతి ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భారతి, తండ్రి చింతల రాంబాబు తీవ్ర అస్వస్థతకు గురై 28వ తారీఖున నాడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడు లేని తన ఇంటిలో సంప్రదాయపరంగా కొరివి పెట్టాల్సిన బాధ్యత కుమార్తె భారతి తీసుకుంది. ఈ తరుణంలోనే కన్నతండ్రికి తలకొరివి పెట్టింది. ఈ సంఘటన చూసిన చర్ల మండల అంబేద్కర్ నగర్ గ్రామ ప్రజలు, కంటే కూతుర్నే కనాలి అంటూ అభినందిస్తున్నారు.
Next Story






