- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టిఫిన్ సెంటర్ యజమాని అకౌంట్లోకి రూ.6 కోట్లు.. దెబ్బకు పరార్..
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఆరు కోట్ల రూపాయల హవాలా జరిగినట్లు

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఆరు కోట్ల రూపాయల హవాలా జరిగినట్లు పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతోంది. బస్టాండ్ సమీపంలోని టిఫిన్ హోటల్ యజమాని అకౌంట్లో ఆరుకోట్ల రూపాయలు పడడంతో రాత్రికి రాత్రే ఊరు నుంచి వెళ్లిపోయాడని జోరుగా ప్రచారం సాగుతోంది. అకౌంట్లో పడ్డ ఆరు కోట్ల రూపాయలు టిఆర్ఎస్ ముఖ్య నాయకుడి అనుచరుడివి అని కొంతమంది, పట్టణంలో పేరొందిన ప్రముఖ బట్టల దుకాణ యజమానివని మరో కొంతమంది అంటున్నారు. చిన్న షెడ్డులో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న చిరు వ్యాపారస్తుడి అకౌంట్లో ఆరు కోట్ల రూపాయలు పడడం పట్టణ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకవేళ 6 కోట్ల రూపాయలు సక్రమంగా వచ్చిన ధనం అయితే.. హోటల్ యజమాని ఊరు నుంచి పరార్ అవ్వాల్సిన అవసరం ఏముందని,ఎ వరో బడాబాబులు హోటల్ యజమానిని బినామీగా ఎంచుకొని ఈ వ్యవహారమంతా నడిపిస్తున్నట్లు పట్టణంలో పుకార్లు షికార్ చేస్తున్నాయి.






