205 కిలోల గంజాయి పట్టివేత

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతూరు నుంచి హర్యానాకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని బూర్గంపాడు ఎస్ఐ ప్రసాద్ పట్టుకున్నారు.

205 కిలోల గంజాయి పట్టివేత
X

దిశ-బూర్గంపాడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతూరు నుంచి హర్యానాకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని బూర్గంపాడు ఎస్ఐ ప్రసాద్ పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి పాల్వంచ సీఐ సతీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్ఆర్ 33 బాధ్యత 6330 నెంబర్ గల కారులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతూరు నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు బూర్గంపాడు ఎస్సై ప్రసాద్ తన సిబ్బందితో మొరంపల్లిబంజర గ్రామం దగ్గర పట్టుకున్నారు.

మొత్తం నలుగురిలో ఒక నిందితుణ్ణి పట్టుకొని, కారులో ఉన్న 204.930 కిలోల గంజాయిని,కారు,ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడు హర్యానా రాష్ట్రానికి చెందిన సంజీవ్ కుమార్ తన కారు ఓనర్ అయిన ప్రిన్స్ కుమార్ ఆదేశాల ప్రకారం చింతూరు వైపు వెళ్లి అక్కడ ప్రధాన్ ఖారా,లఖన్ హంతాల్ వద్ద గంజాయి లోడ్ చేసుకొని తిరిగి హర్యానా వెళుతుండగా పట్టుకున్నట్లు సీఐ సతీష్ వెల్లడించారు. పట్టుబడిన నిందితుడిపై కేసు నమోదు చేసి,రిమాండ్ నకు తరలించినట్లు తెలిపారు.స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1,02,46,500 లు ఉంటుందని తెలిపారు.హర్యానాకు చెందిన మరో ముగ్గురు నిందితులు ప్రిన్స్ కుమార్,ప్రధాన్ కారా,లఖన్ హంతాల్ లు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Next Story