ఆయుధాలతో సహా లొంగిపోయిన 15 మంది మావోయిస్టులు

by Jakkula.Mamatha |

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులకు విధించిన గడువు దగ్గర పడటంతో, మావోయిస్టులు వరుసగా లొంగిపోతున్నారు.

ఆయుధాలతో సహా లొంగిపోయిన 15 మంది మావోయిస్టులు
X

దిశ, భద్రాచలం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులకు విధించిన గడువు దగ్గర పడటంతో, మావోయిస్టులు వరుసగా లొంగిపోతున్నారు. ఒరిస్సా రాష్ట్ర కమిటీ సభ్యుడు సుదర్శన్ సహా 15 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులందరూ మహాసముంద్‌లోని సరైపాలి బలోడా అడవులలో తమ కార్యకలాపాలు నిర్వహించేవారు. ఆటోమేటిక్, స్వదేశీ ఆయుధాలతో సహా మావోయిస్టులు మహాసముంద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Next Story