- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగిన గుండెకు ఊపిరిలూదిన 108 సిబ్బంది
గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన వ్యక్తికి సత్తుపల్లి 108 సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.

దిశ,సత్తుపల్లి: గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన వ్యక్తికి సత్తుపల్లి 108 సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన శనివారం సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో జరిగింది. స్థానికులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన పాలకుర్తి ఆదాయ శనివారం సాయంత్రం గుండెపోటు తో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పాలకుర్తి ఆదాయకు సీపీఆర్ చేసి సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సీపీఆర్ వైద్య సేవలు సకాలంలో అందించిన సత్తుపల్లి 108 సిబ్బంది ఈఎంటి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గొల్లమందల కృష్ణ, పైలట్ ఏకాంత్‌ను కిష్టారం గ్రామస్తులు, 108 జిల్లా మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్ అభినందించారు.






