- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుళ్లిన కూరగాయాలతో కర్రీలు… ప్రజల ఆరోగ్యంపై వర్రీ..!
ఖమ్మం నగరంలో రోజు రోజుకూ ప్రతి వీధికి విచ్చలవిడిగా కర్రీ పాయింట్లు వెలుస్తున్నాయి.

దిశ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలో రోజు రోజుకూ ప్రతి వీధికి విచ్చలవిడిగా కర్రీ పాయింట్లు వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఓ షెటర్ను కిరాయికి తీసుకొని మార్కెట్లో రెండో రకానికి చెందిన కూరగాయలను అతి తక్కువ ధరకు తీసుకువచ్చి కుళ్లిన కూరగాయలతో కూరలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కర్రీలు తయారు చేయడానికి ఓ కార్ఖానాలు ఏర్పాటు చేసి ఇష్టారాజ్యంగా కూరలు వండుతూ సంపాదనే ధ్యేయంగా వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. నగరంలో ఉంటున్న బ్యాచిలర్స్, పలు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులే టార్గెట్‌గా చేసుకొని కుళ్లిన కూరగాయలు తీసుకొచ్చి తమ ఇష్టారాజ్యంగా వంటలు తయారు చేస్తూ రూ.20నుంచి రూ.50వరకు ధరలను నియమించి వసూలు చేస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తూ..
ఫుడ్ సేఫ్టీ అధికారుల నిబంధనల మేరకు హోటల్‌కు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే కర్రీ పాయింట్లు పెట్టి, వ్యాపారాలను మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. ప్రతి షాప్ లో తప్పనిసరిగా అనుమతి తీసుకున్న లైసెన్స్ తగిలించాలి. కానీ ఖమ్మం నగరంలో దాదాపు రెండు వేలకు పైగా కర్రి పాయింట్లు ప్రధాన రహదారుల వెంట ఉన్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు అనుమతులు ఉన్నాయా లేవా అంటూ తనిఖీలు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ.. వ్యాపారాలు కొనసాగిస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, లైసెన్సులు లేకుండా నడుపుతున్న వారిపై సంబంధిత అధికారి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ శాఖ అధికారికి ప్రతినెల మామూళ్లు సహజమేనని ఏమైనా అంటే ఉడతా భక్తి లాగా ఏదో నామమాత్రపు తనిఖీలు చేపట్టి శాంపిల్స్ తీసుకోవడం తప్ప చర్యలు ఏమీ ఉండవని ఇప్పటికే ఖమ్మంలో పలు ఆరోపణలు ఉన్నాయి.
ఇష్టారాజ్యంగా..
రహదారుల వెంటనే కర్రీ పాయింట్‌లు ఉండటంతో రహదారుల వెంట వాహనాలు వెళుతుండటంతో వెలువడుతున్న దుమ్ము ధూళి కర్రీ పాయింట్ లో చేరుతున్నప్పటికీ యజమానులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కూరలను కొనుగోలు చేసి తినేవారు ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు పలు కర్రీ పాయింట్లలో కర్రీలు దుర్వాసన వస్తున్నాయని గొడవలకు దిగినా ఎవరు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. లైసెన్సులు లేకుండా నడిపిస్తున్న కర్రీ పాయింట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కర్రీ పాయింట్లకు అనుమతులు తప్పనిసరి : కిరణ్ కుమార్, జిల్లా ఆహార తనిఖీ అధికారి
నగరంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కర్రి పాయింట్లకు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని లేనియెడల అనుమతులు లేని కర్రీ పాయింట్లపై చర్యలు కచ్చితంగా తీసుకుంటాము. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హోటల్ పై కర్రీ పాయింట్లపై చర్యలు తప్పకుండా తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.






