తెలంగాణ ఇంటర్ ఫలితాలపై కీలక అప్ డేట్..

by Disha Web Desk 13 |
తెలంగాణ ఇంటర్ ఫలితాలపై కీలక అప్ డేట్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు సోమవారం అధికారిక ప్రకటన చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షా ఫలితాలు విడుదల చేయనునున్నట్లు అధికారులు తెలిపారు. నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ రిజల్ట్స్‌ను రిలీజ్ చేస్తారని చెప్పారు.

ఇప్పటికే ఆలస్యం కావడంతో మంగళవారం విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలను ఫస్టియర్ నుంచి 4 లక్షల 83 వేల మంది, సెకండియర్ నుంచి 4 లక్షల 24 వేల మంది విద్యార్థులు రాశారని ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు.

Also Read..

తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ.. ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు

Next Story