- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mulugu: నా భర్తను గొడ్డలితో నరుకుతుండగా చూశా: అర్జున్ భార్య
by Gantepaka Srikanth |
తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారనే నెపంతో మావోయిస్టులు(Maoists) పేరూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్, అతని సోదరుడు అర్జున్‌ను నరికి చంపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారనే నెపంతో మావోయిస్టులు(Maoists) పేరూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్, అతని సోదరుడు అర్జున్‌ను నరికి చంపారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి ములుగు(Mulugu) జిల్లా వాజేడు(Vajedu) మండలం జంగాలపల్లి పెనుగోలు కాలనీలో చోటుచేసుకుంది. అనంతరం ఈ హత్యలను తామే చేసినట్లు వాజేడు, వెంకటాపురం ఏరియా మావోయిస్టు కమిటీ కార్యదర్శి లేఖ విడుదల చేశారు. తాజాగా.. ఈ హత్యలపై చనిపోయిన అర్జున్ భార్య మీడియాతో మాట్లాడారు. ‘అర్ధరాత్రి కాలనీలో చొరబడి కరెంట్ తీసేశారు. ఇంట్లో పడుతున్న నా భర్తను తలుపులు తట్టి బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. నా కళ్ల ఎదుటే నా భర్తను గొడ్డళ్లతో నరికి చంపారు. అలాంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు’ అని అర్జున్ భార్య మీడియా ఎదుట బోరున విలపించారు.
Next Story






