ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ముందడుగు.. హైదరాబాద్‌కు రానున్న ప్రభాకర్ రావు

by Muthe.Rajitha |   (  Updated:2025-06-06 17:39:42  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కోన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు 9 వ తేదిన విచారణకు హజరవ్వనున్నట్లు తెలుస్తున్నది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ముందడుగు.. హైదరాబాద్‌కు రానున్న ప్రభాకర్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు 9 వ తేదిన హజరవ్వనున్నట్లు తెలుస్తున్నది. పాస్ పోర్టు రద్దు కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమర్జెన్సీ ట్రాన్సింట్ వారెంట్ ను ఇండియన్ ఎంబసీ మంజూరు చేసినట్లు తెలుస్తుంది. శనివారం అమెరికా నుంచి బయలు దేరుతారని ఆదివారం అర్ధరాత్రి వరకు ఇండియాకు చేరుతారని, సోమవారం సిట్ విచారణకు కూడా హజరువుతారంటు ప్రభాకర్ రావు సన్నిహితులు చెబుతున్నారు. విచారణకు హజరయ్యే అంశంలో మాత్రం సిట్ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు.

నాంపల్లి కోర్టు ఆదేశాలలో ఈనెల 20వ తేది వరకు గడువు ఉందని, పాస్ పోర్టు మంజూరు అయిన మూడు రోజులలో విచారణకు హజరవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని తెలుపుతున్నారు. ఈనెల 5న కూడా విచారణకు హాజరవుతారంటు అందుకు సంబంధించిన లేఖను సిట్ అధికారులకు మెయిల్ చేశారని ఊహగానాలు వినిపించాయి.

Next Story
null