Kishan Reddy: ఢిల్లీకి ఎప్పుడొచ్చినా నేను రెడీ.. చేనేత వారోత్సవాల్లో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-08-03 07:55:31  IST  )

దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగం కీలక పాత్ర అని కిషన్ రెడ్డి అన్నారు.

Kishan Reddy: ఢిల్లీకి ఎప్పుడొచ్చినా నేను రెడీ..  చేనేత వారోత్సవాల్లో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించేది చేనేత రంగమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగానిది కీలక పాత్ర అని అటువంటి చేనేత పరిశ్రమకు దురదృష్టవశాత్తు అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. జాతీయ చేనేత దినోత్సవ వారోత్సవాలు (National Handloom Day Weeklong Celebrations) సందర్భంగా ఇవాళ మాదాపూర్ లోని శిల్పారామం నిర్వహించిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విదేశీ మారక నిల్వలు తీసుకురావడంలో చేనేత కార్మికులు విశేష పాత్ర పోషిస్తున్నారన్నారు. చేనేత రంగంపై ఆధారపడి సుమారు 5 కోట్ల మంది జీవిస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగానికి చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. మన దేశంలోని చేనేత ఉత్పత్తుల ఎంతో నైపుణ్యంతో పాటు సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేనేత రంగం అభివృద్ధి కోసం ఫ్యాబ్రిక్, ఫ్యాషన్, ఫిలియేషన్, ఫైనాన్స్, ఫెసిలిటేషన్ అనే ఫైవ్ 'ఎఫ్' స్ట్రాటజీని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.

మన దేశ జీడీపీలో చేనేత రంగం వాటా 5 శాతానికి చేరితే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తద్వారా ఈ రంగంలోని ఇబ్బందులు కూడా తొలగిపోతాయన్నారు. దీన్ని సాధించేందుకు ప్రధాని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. మన దేశ ఎగుమతుల్లో 13 శాతం చేనేత రంగం నుంచే ఉన్నాయని వెల్లడించారు. చేనేత రంగం అభివృద్ధి కోసం సమగ్రమైన ప్రణాళికతో ఢిల్లీకి వస్తే కేంద్ర ప్రభుత్వం వద్దకు మీ ఆలోచనలు తీసుకువెళ్లేందుకు ఎప్పుడూ సిద్ధమేనన్నారు. మన దేశంలో పరిపాలన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అనేక సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని చివరి కేబినెట్ భేటీలో ప్రధాని మోడీ (Modi) చెప్పారన్నారు.

Next Story