- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో కీలక ప్రగతి!
తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల సాధన లక్ష్యంగా దావోస్(Davos )వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు(World Economic Forum conference)కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి డి.శ్రీధర్ బాబు(Minister D. Sridhar Babu)ల బృందం కీలక పురోగతి సాధించింది

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల సాధన లక్ష్యంగా దావోస్(Davos )వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు(World Economic Forum conference)కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి డి.శ్రీధర్ బాబు(Minister D. Sridhar Babu)ల బృందం కీలక పురోగతి సాధించింది. హైదరాబాద్ లో హెచ్ సీఎల్ సంస్ధ(HCL) కొత్త టెక్ సెంటర్ ఏర్పాటుకు సన్నద్ధత వ్యక్తం చేసింది. సదస్సులో తెలంగాణ పెవిలియన్ లో హెచ్ సీఎల్ టెక్ గ్లోబల్ సీఈఓ, ఎండీ విజయ కుమార్ తో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి డి.శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్ సీఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటుకు వారు అంగీకారం తెలిపారు. హెచ్ సీఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటు ద్వారా దాదాపు 5 వేల మంది ఐటీ నిపుణులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశముంది.
అంతకుముందు రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కంట్రోల్ ఎస్ (CtrlS) తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో అత్యాధునిక ఏఐ(AI) డేటాసెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకం చేసింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. అర్టిఫిషియల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఈ కంపెనీ రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 400 మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నెలకొల్పుతుంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారులు విప్రో, సన్ పెట్రో కెమికల్స్, జేఎస్ డబ్ల్యు గ్రూప్, లోంజా గ్రూప్, మిత్రా ఎనర్జీ, టిల్ మన్ గ్లోబల్ హోల్డింగ్స్, బ్లాక్ స్టోన్ కంపెనీలతో ఈ రోజు చర్చలు జరుపుతారు. చర్చల అనంతరం రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి మరిన్ని కీలకమైన ఎంవోయూలు చేసుకోనున్నారు. ’బిల్డింగ్ రీజనరేటివ్ అండ్ సర్క్యులర్ ప్లేసేస్’ ధీమ్ తో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు.






