HCA : హెచ్‌సీఏ బృందం సీఐడీ కేసులో కీలక అంశాలు.. ఐదుగురిపై కేసులు నమోదు

by Ramesh Naini |   (  Updated:2025-07-10 07:32:12  IST  )

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమాలపై సీఐడీ పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది.

HCA : హెచ్‌సీఏ బృందం సీఐడీ కేసులో కీలక అంశాలు.. ఐదుగురిపై కేసులు నమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అక్రమాలపై సీఐడీ (CID) పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఇందులో భాగంగా సీఐడీ కేసులో ఇవాళ కీలక అంశాలను అధికారులు ప్రకటన విడుదల చేశారు. నిధుల దర్వినియోగం కేసులో హెచ్‌సీఏలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, హెచ్‌‌‌సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, సీఈవో సునీల్ అరెస్ట్ అయ్యారు. అలాగే శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌కు చెందిన రాజేందర్ యాదవ్, అతని భార్య కవితను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోర్జరీ డాక్యూమెంట్స్, నకిలీ దస్త్రాలు సృష్టించారనే కేసులో సీఐడీ విచారణ చేపట్టారు. 465, 468, 471, 403, 409, 420 r/w 34 ఐపీసీ కింద నిందితులపై కేసులు నమోదు చేశారు. హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో జగన్మోహన్‌రావు నకిలీ పత్రాలు సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో నకిలీ పత్రాలను జగన్మోహన్ రావు సృష్టించారు. గౌలిపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ సి. కృష్ణ యాదవ్ సంతకం ఫోర్జరీ చేశారు. కృష్ణ యాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేశారు. ఆ ఫోర్జరీ పత్రాలను జగన్మోహన్‌రావుకు కవిత అందించినట్లు సీఐడీ వెల్లడించింది.

నకిలీ పత్రాలతోనే హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎన్నిక అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. హెచ్‌సీఏ నిధులు దుర్వినియోగం చేశారని జగన్మోహన్‌రావుపై అభియోగాలు ఉన్నాయి. నిధుల దుర్వినియోగంపై టీసీఏ అధ్యక్షుడు ధరం గురువారెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ కేసులు నమోదు చేసింది. దర్యాప్తు చేపట్టి హెచ్‌సీఏలో అక్రమాలు సీఐడీ అధికారులు గుర్తించారు. జగన్మోహన్‌రావుకు కోశాధికారి శ్రీనివాస్‌రావు, సీఈవో సునీల్ సహకరించినట్లు ఆధారాలు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రావు, శ్రీనివాస్‌రావు, సునీత్, రాజేందర్ యాదవ్, కవితను అరెస్ట్ చేశారు. అదేవిధంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, హెచ్‌సీఏ మధ్య ఐపీఎల్‌ టికెట్ల వివాదంలో సీఐడీ విచారణ చేపడుతోంది. గత ఐపీఎల్‌ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌,హెచ్‌సీఏ మధ్య టికెట్ల వివాదం తీవ్ర స్థాయిలో కొనసాగిన విషయం తెలిసిందే.

Next Story