- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీభవన్‌లో కీలక సమావేశం.. తప్పక హాజరుకావాలని ఆదేశాలు
టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన గాంధీ భవన్‌లో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన గాంధీ భవన్‌లో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ హాజరుకానున్నారు. ఎస్ఎస్ఏ పనితీరు, కమిటీల నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఏ పార్లమెంట్ స్థాయి కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ కోఆర్డినేటర్లతో రెండు విడతలుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. మొదటి సమావేశం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇందిరాభవన్‌లో జరుగుతుంది. ఇందులో ఎస్ఎస్ఏ పార్లమెంట్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు పాల్గొంటారు. రెండో సమావేశం గాంధీ భవన్ కాన్ఫరెన్స్ హాల్‌లో పార్లమెంట్ వారీగా నిర్వహించనున్నారు. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి, ప్రతి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, సంబంధిత జిల్లా అధ్యక్షులు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన సమయాలను తరువాత ప్రకటించనున్నారు. ఈ సమావేశాలకు సంబంధిత నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని టీపీసీసీ సూచించింది.






