- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: కులగణనపై కాంగ్రెస్ కీలక సమావేశం
తమ ఒత్తిడి వల్లే కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తమ ఒత్తిడి వల్లే కేంద్ర ప్రభుత్వం కులగణన (Caste Census) చేపట్టాలని నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ (Congress) నిర్ణయించింది. ఇవాళ ఢిల్లీ లోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో ఓబీసీ ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీతో పాటు తెలంగాణ నుంచి పీసీసీ చీఫ్, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ బీసీ నేతల బృందం హాజరైంది. ఈ సమావేశంలో కులగణను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నేతలకు అధిష్టానం కీలక దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం.
దేశానికే ఆదర్శంగా తెలంగాణ:పొన్నం
దేశానికే ఆదర్శంగా తెలంగాణలో కులగణన జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఈ సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులసర్వే దారిలోనే కేంద్రం కూడా దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించబోతున్నదన్నారు. కులగణనతోనే దేశంలో బలహీనవర్గాలకు న్యాయం దక్కుతుందని జనాభా ప్రకారం వాటా దక్కాలనేది రాహుల్ నినాదం అన్నారు. కులగణన చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బలహీనవర్గాలకు మేలు జరిగేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కార్యాచరణపై ఇవాళ్టి సమావేశంలో చర్చిస్తామన్నారు. కులగణన ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. కులగణన ద్వారా ఇన్నాళ్లు అవకాశం దక్కని బీసీలంతా ప్రజాస్వామ్య వేదికలో భాగస్వామ్యం అవుతారన్నారు. తెలంగాణ చేపట్టిన కులగణను విధివిధానాలపై ఓ పుస్తకాన్ని తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తామన్నారు. బీసీలకు మేలు జరగాలన్నదే రాహుల్ గాంధీ ఆలోచన అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.






