- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిషన్ రెడ్డి ఇంట్లో బీజేపీ ఎంపీల కీలక భేటీ
గురువారం రాత్రి ఢిల్లీలోని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు సమావేశమయ్యారు.

- తెలంగాణ ఎంపీలకు ప్రధాని మోదీ చురకల నేపథ్యంలో ప్రాధాన్యం
దిశ, తెలంగాణ బ్యూరో: గురువారం రాత్రి ఢిల్లీలోని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్, కొండా విశ్వేశ్వరరెడ్డి, గొడం నగేశ్ తో పాటు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను, పార్టీ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా మరింత పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, టీ బీజేపీ చీఫ్ రామచంద్రరావు నేతృత్వంలో తెలంగాణలో పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ, మునిసిపాలిటీ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో.. ప్రత్యేకమైన వ్యూహంతో పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ప్రధాని క్లాస్... కిషన్ రెడ్డి మాస్ నేపథ్యంలో...
ఒడిశా లాంటి చోట కూడా బీజేపీ గెలిచిందని, మరి మీ దగ్గర ఏమైందంటూ తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని మోదీ ఇటీవల పార్టీ ఎంపీల సమావేశంలో సీరియస్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ కన్నా ఎంఐఎం బలంగా పని చేస్తున్నదని, కమల దళం కన్నా ఒవైసీ సోష‌్ల్ మీడియా టీమ్ యాక్టివ్‌గా ఉందన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారని, ఇప్పటికైనా పార్టీ నేతలు తీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. ప్రధానంగా సోషైల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉండాలెని కీలక సూచన చేశారు. అయితే ప్రధాని మోదీ సమావేశం అంశంపై మీడియాకు లీకులిచ్చారంటూ తమ పార్టీ ఎంపీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మీటింగ్‌లో చర్చించిన విషయాలు బయటకు చెప్పవద్దని మోదీ స్వయంగా ఆదేశించారని... అయినా ఎవరో మెంటలోళ్లు అక్కడ జరిగింది ఒకటైతే... మీడియాకు మరోలా చెప్పారని, వాళ్లెవరో చెబితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి ఇంట్లో ఎంపీలందరికి సమావేశం కీలక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.






