- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం కమిషన్ నివేదికపై రేపు సచివాలయంలో కీలక సమావేశం
by Ajay Maddhiboyina |
కాళేశ్వరం కమిషన్ నివేదికపై రేపు సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై రేపు సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. అంతే కాకుండా ఈ నెల 4వ తేదీన కమిషన్ నివేదికపై మంత్రివర్గం సైతం చర్చించనుంది. ఇదిలా ఉంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేతికి కాలేశ్వరం కమిషన్ నివేదిక అందిన సంగతి తెలిసిందే.
నివేదికలోని అంశాలపై సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు సీఎస్‌తో చర్చించారు. నివేదిక అధ్యయనం కోసం ఓ కమిటీని కూడా వేశారు. నివేదికలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలకు పాల్పడినట్టు తేలిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ దోషి అని కమిషన్ తేల్చిందని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. వారికి శిక్ష తప్పదని అన్నారు. ఈ క్రమంలో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.
Next Story






