- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలవరం ముంపుపై సంయుక్త సర్వే!
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా రాష్ట్రంలోని ముంపు ప్రాంతాలపై సమగ్ర అధ్యయనం చేయాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) కేంద్ర జలసంఘం సీడబ్ల్యూసీని కోరింది.

దిశ, తెలంగాణ బ్యూరో: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా రాష్ట్రంలోని ముంపు ప్రాంతాలపై సమగ్ర అధ్యయనం చేయాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) కేంద్ర జలసంఘం సీడబ్ల్యూసీని కోరింది. ఈ మేరకు పీపీఏ సభ్య కార్యదర్శి ఎం.రఘు రామ్‌కు లేఖ రాశారు. ఆరు నదుల క్రాస్ సెక్షన్‌పై ఇరు రాష్ట్రాలు సంయుక్త సర్వే నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అనేక సార్లు చర్చలు జరిగాయని.. ఈ ఏడాది ఏప్రిల్ 8న జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణలోని ఆరు నుండి ఏడు పెద్ద వాగులలో క్రాస్ సెక్షన్ సర్వే పీపీఏ, సీడబ్ల్యూసీ సహకారంతో చేపట్టాలని నిర్ణయించారు.
గతంలో కిన్నెరసాని, ముర్రెడువాగు వంటి వాగులపై సీడబ్ల్యూసీ విజయవంతంగా అధ్యయనాలు నిర్వహించినందున, ఇప్పుడు మిగిలిన వాగులపై కూడా ఈ అధ్యయనాన్ని చేపట్టాలని పీపీఏ తన లేఖలో విజ్ఞప్తి చేసింది. ఈ అధ్యయనం ద్వారా తెలంగాణలోని ప్రభావిత ప్రాంతాలకు శాశ్వత పరిష్కారాలను చూపించొచ్చని పేర్కొంది. అధ్యయనానికి అవసరమైన భూ సర్వేలు, క్రాస్-సెక్షన్ డేటాను సేకరించడంలో పీపీఏ పూర్తి సహకారాన్ని అందిస్తుందని, అందుకు అయ్యే ఖర్చులను కూడా భరిస్తుందని సభ్య కార్యదర్శి తన లేఖలో పేర్కొన్నారు. ఈ అధ్యయనం ద్వారా లభించిన డేటా ఆధారంగా, భవిష్యత్తులో తలెత్తే సమస్యలకు పరిష్కారాలు కనుగొని, ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, తగిన రక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.






