- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోనున్న ఇద్దరు నక్సలైట్లు..!

X
దిశ, గోదావరిఖని: తెలంగాణలో నక్సలైట్ల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతుండగా, త్వరలో మరో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ సభ్యుడిగా ఉన్న ఆత్రం లచ్చన్న, బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీగా ఉన్న ఆత్రం అరుణ గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారుల ఎదుట లొంగిపోవాలని భావిస్తున్నారని విశ్వసనీయ సమాచారం.
సుమారు ముప్పై సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న లచ్చన్న స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా కాగా, ఈ లొంగుబాటు పోలీస్ శాఖకు కీలక విజయంగా భావిస్తున్నారు. మావోయిస్టు తలపు నుంచి బయటపడే లైన్‌లో పలువురు ఉన్న నేపథ్యంలో, ఈ ఇద్దరి లొంగుబాటు రాష్ట్రం మావోయిస్టు చరిత్రలో మరో మైలురాయిగా నిలవనుంది.
Next Story






