- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR: తెలంగాణ భవన్ వద్ద కేసీఆర్.. సెక్యూరిటీ అత్యుత్సాహంపై విమర్శలు
బడ్జెట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్ పార్టీ సభ్యులకు కీలక దిశానిర్దేశం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : ఆరు గ్యారెంటీలతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై సభలో ప్రభుత్వాన్ని నిగ్గదీసి నిలదీద్దామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చర్చలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ప్రజాసమస్యలపై తనతోపాటు అందరూ గళమెత్తాలని సూచించారు. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు (Budget Session) ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇవాళ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ (KCR) అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ (BRSLP) సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చర్చలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఇరిగేషన్, విద్యుత్‌పై..
దాదాపు ఏడాది తర్వాత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్‌పై సుదీర్ఘంగా చర్చించారు. గత కొంతకాలంగా అధికారపక్షం తమపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు అవసరమైన సూచనలను చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు, విద్యుత్ అంశాలపై ప్రభుత్వం న్యాయవిచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ అంశాలతోనే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కేసీఆర్ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీతో జలవివాదాలు, ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎండిపోతున్న పంటలు, విద్యుత్ సమస్యలు, ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలిన ఘటనతో పాటు రాష్ట్రంలోని వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చి వాటిపై చర్చకు గట్టిగా పట్టుపట్టేలా ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేస్తున్నారు.
సెక్యూరిటీ అత్యుత్సాహం..
తెలంగాణ భవన్ వద్ద సెక్యూరిటీ అత్యుత్సాహం ప్రదర్శించారు. నిన్నా మొన్నటితో పోలిస్తే ఇవాళ పార్టీ ఆఫీస్ వద్ద సెక్యూరిటీ పెంచారు. మెటల్ డిటెక్టర్‌తో తనిఖీలు నిర్వహించారు. అయితే కేసీఆర్ సమావేశం నిమిత్తం వచ్చిన మీడియాను సైతం అడ్డుకున్నారు. మీడియాను సైతం చాలాసేపు గేట్ బయటే నిలిపివేయడంతో సెక్యూరిటీ తీరుపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.






