స్కూళ్లకు సర్కారు కీలక ఆదేశాలు.. రేపు ఆ గీతం పాడాలి

by Muthe.Rajitha |

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

స్కూళ్లకు సర్కారు కీలక ఆదేశాలు.. రేపు ఆ గీతం పాడాలి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు అన్ని స్కూళ్లల్లో ఉదయం 10 గంటలకు వందేమాతరం గీతం ఆలపించాలని ఉత్తర్వులు పంపింది. వందేమాతరం రచించి 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని కేంద్రం రాష్ట్ర సీఎస్ లకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో సర్కార్ తాజాగా స్కూళ్లకు ఉత్తర్వులిచ్చింది. పాఠశాలతోపాటు, కలెక్టరేట్లు, అన్ని ప్రభుత్వ ఆఫీసులలో రేపు ఉదయం తప్పనిసరిగా వందేమాతరం పాడాలని పేర్కొంది. కాగా దేశ ప్రజలంతా అందులో పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది.

Next Story