- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసు శాఖలో కీలక పరిణామం.. మరో ఎనిమిది మంది IPSలు బదిలీ
తెలంగాణ పోలీసు శాఖ (Telangana Police Department)లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీసు శాఖ (Telangana Police Department)లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పరిపాలన సౌలభ్యం, సమర్థవంతమైన పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎనిమిది మంది సీనియర్ అధికారులను బదిలీలు చేస్తూ ఇవాళ హోంశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఐడీ ఎస్పీగా కె.ప్రసాద్, కమాండ్ కంట్రోల్ ఎస్పీగా ఐ.పూజ, రాచకొండ అదనపు ఎస్పీగా ఎస్.రవి, ఏసీబీ డీజీ ఆఫీస్‌కు (అటాచ్) ఎస్.సూర్యనారాయణ, ఎస్‌వోటీ అదనపు డీసీపీగా టి.గోవర్ధన్ ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీగా జి.నరేందర్, సైబరాబాద్ అదనపు డీసీపీగా ఎం.సుదర్శన్, హైదరాబాద్ సిటీ డీసీపీగా కె.వెంకటలక్ష్మి బదిలీ అయిన వారిలో ఉన్నారు. కాగా, ఈ బదిలీలతో పాటు పలువరు అదనపు SP ర్యాంకు అధికారులకు కూడా కొత్త బాధ్యతలు అప్పగించారు. ఇటీవలి కాలంలో పోలీసు శాఖలో వరుస బదిలీలు చర్చనీయాశంగా మారాయి. ఈ మార్పులు పోలీసు వ్యవస్థలో మరింత సమన్వయం, సామర్థ్యం పెంపొందించడానికి దోహదపడతాయని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.






