‘కాళేశ్వరం’ ఇష్యూలో కీలక పరిణామం.. ACBకి విజిలెన్స్ విభాగం సంచలన లేఖ

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-29 03:38:47  IST  )

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌ (Kaleshwaram Lift Irrigation)లో భాగంగా బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఆర్థిక అవకతవకలపై విచారించడానికి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

‘కాళేశ్వరం’ ఇష్యూలో కీలక పరిణామం.. ACBకి విజిలెన్స్ విభాగం సంచలన లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌ (Kaleshwaram Lift Irrigation)లో భాగంగా బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఆర్థిక అవకతవకలపై విచారించడానికి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఇఫ్ ఇన్వెస్టిగేషన్‌ (CBI)కి అప్పగిస్తున్నట్లుగా సీఎం రేవంత్‌ రెడ్డి నిండు అసెంబ్లీలో ప్రకటించారు. అయితే, ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం అక్రమాలపై తాజాగా రంగంలోకి ఏసీబీ (ACB) ఎంటర్ కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో జరిగిన నష్టంపై వెంటనే దర్యాప్తు జరపాలని ఏసీబీకి విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ సంచలన లేఖ రాసింది. కాంట్రాక్టర్ల నుంచి బాధ్యులు ఎలా అబ్ధి పొందారో.. సమగ్రంగా విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులు ఆ లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు విజిలెన్స్ రాసిన లేఖను ఏసీబీ డీజీ ఇవాళ సీఎస్ రామకృష్ణా రావు (CS Rama Krishna Rao)కు పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కాళేశ్వరంపై ఏసీబీ విచారణను ప్రారంభిచనుంది.

Next Story