- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావు సరెండర్.. విచారణ షురూ!
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కోన్న ఎస్ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ ఏదుట శుక్రవారం సరెండర్ అయ్యారు. ప్రభాకర్ రావు లొంగుబాటుతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, సిట్ అధికారులు ప్రభాకర్ రావును వారం రోజుల పాటు కస్టడీలో విచారణ చేపట్టనున్నారు. ఈ విచారణలో ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ నెట్‌వర్క్‌ను ఎలా ప్లాన్ చేశారు, ఎవరు ఆదేశించారు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు అనే వివరాలను రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ప్రభాకర్ రావు తన ఐక్లౌడ్ ఖాతాల నుంచి డేటాను తొలగించారని, హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
కస్టడీలో ఈ సాక్ష్యాల ధ్వంసం వెనుక కారణాలు వివరాలపై అధికారులు ప్రశ్నించనున్నారు. విచారణ ద్వారా, ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆదేశాలు ఇచ్చిన మాజీ మంత్రులు లేదా అధికార పార్టీ నేతల పేర్లు బయటకు వచ్చే సూచనలు ఉన్నట్లు తెలుస్తుంది. విచారణలో లభించిన ఆధారాల మేరకు, కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని సిట్ అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. సిట్ తన దర్యాప్తు పురోగతి నివేదికను డిసెంబర్ 19న సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






